Header Banner

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

  Sun May 11, 2025 20:11        India

ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసారు. పాక్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కాల్పుల విరమణ నిర్ణయం తరువాత ప్రధాని మోదీ త్రివిధ దళాలతో కీలక భేటీ నిర్వహించారు. అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగిన వేళ.. కాశ్మీర్ పైన ప్రధాని తమ వైఖరి తేల్చి చెప్పారు. కాశ్మీర్ విషయంలో అమెరికా మధ్య వర్తిత్వం పైన ట్రంప్ ప్రస్తావన చేయటంతో.. కాశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని.. పీఓకే ను పాక్ తమకు అప్పగించాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. అదే విధంగా పాక్ ఒక్క సారి కాల్పులు జరిపినా.. తీవ్రంగా స్పందించాలని త్రివిధ దళాలకు ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

 

ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. రేపు (సోమవారం) రెండు దేశాల సైనికాధికారుల చర్చల వేళ ప్రధాని మోదీ తమ విధానం తేల్చి చెప్పారు. ఉగ్రవాదం పాక్ వీడేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసారు. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ ముగియ లేదని ప్రధాని మోదీ స్పష్టం చేసారు. కాల్పుల విరమణ తరువాత పాక్ నుంచి ఒక్క సారి కాల్పులు జరిగితే.. దానికి పది రెట్లు తీవ్రంగా బదులు ఇవ్వాలని సూచించారు. ఒక్క తూటా పేలినా.. క్షిపణి తో సమాధానం ఇవ్వాలన్నారు. అదే సమయంలో పీఓకే పైనా మోదీ స్పందించారు. పీఓకే ను భారత్ కు పాక్ అప్పగించటం మినహా మరో గత్యంతరం లేదన్నారు. ఈ విషయంలో ఎవరి మధ్య వర్తిత్వం తమకు అవసరం లేదన్నారు. పాక్ లోని ఉగ్రవాదులను తమకు అప్పగించాల్సిందేనని ప్రధాని తేల్చి చెప్పారు.

 

ఆపరేషన్ సింధూర్.. పాక్ డ్రోన్లతో దాడి.. భారత్ తిప్పి కొట్టిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే రావాల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలను భారత్ సైన్యం నేలమట్టం చేసింది. దీంతో, అమెరికా జోక్యంతో రెండు దేశాలు కాల్పుల విరమణ కు అంగీకరించాయి. కాగా.. రేపు రెండు దేశాల డీజీఎంఓ ల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సమయంలో భారత్ వైఖరి పైన ప్రధాని మోదీ స్పష్ట ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రెండో ఆలోచన లేదని తేల్చి చెప్పారు. పాక్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా.. తీవ్ర స్థాయిలో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసారు. పీఓకే విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉందని ప్రధాని గుర్తు చేసారు. పీఓకే తో పాటుగా ఉగ్రవాదులను అప్పగించే విషయంలో పాక్ సానుకూలంగా స్పందించటం పైనే భారత్ నిర్ణయం ఉంటుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi POK Must Be Handed Over by Pakistan